

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 27 రిపోర్టర్ సలికినిడి నాగరాజు తొలి తెలుగు శాసనకర్త “ధనుంజయ ముదిరాజ్”విగ్రహా ఏర్పాటుకు డిమాండ్.పుట్టా వెంకట బుల్లోడు చిలకలూరిపేట : కూటమి ప్రభుత్వం ధనుంజయ ముదిరాజ్ విగ్రహా ఏర్పాటు చేసుకోవడానికి తగిన స్థలాన్ని కళామందిర్ సెంటర్ లో కేటాయించాలని కోరుతున్నాము… చిలకలూరిపేట ముదిరాజు నాయకులు. కోటప్పకొండ తిరునాళ్లకు విచ్చేయు భక్తులకు కళామందిర్ సెంటర్ లో ముదిరాజు సంఘీయుల ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని (6వ వార్షికోత్సవం) నిర్వహించారు. పలువురు ముదిరాజ్ నాయకులు మాట్లాడుతూ కోటప్పకొండ తిరుణాలకు వచ్చే భక్తులకు అన్నదానం సదుపాయాలు ఏర్పాటు ఉందని చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మును ముందు గొప్పగా జరుపుతామని తెలిపారు. కోటప్పకొండ తిరుణాలకు వచ్చే భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకట బుల్లోడు మాట్లాడుతూ చిలకలూరిపేటలో బీసీలలో పెద్ద సంఖ్యలో ముదిరాజులు ఉన్నారని వారి యొక్క చిరకాల కోరిక మేరకు ప్రపంచానికి తెలుగు భాషను అందించినటువంటి ధనుంజయ ముదిరాజు ఒక ముదిరాజులకే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలు, అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారు ఆయనను స్మరించుకుంటూ తెలుగు భాషను కాపాడుకోవాలని పేర్కొన్నారు. ధనుంజయ్ ముదిరాజ్ యొక్క విగ్రహం కళామందిర్ సెంటర్లో ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి ఒక్క ముదిరాజ్ సభ్యులు అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా స్థానిక శాసనసభ్యులు సహకరించాలన్నారు. మున్సిపల్ అధికారులు విగ్రహ ఏర్పాటుకు తగిన స్థలం కళామందిర్ సెంటర్లో కేటాయించాలన్నారు.ప్రతి ఒక్క ముదిరాజ్ సభ్యులు ఐక్యమత్యంతో విగ్రహాన్ని నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.