

జనం న్యూస్- ఫిబ్రవరి 27: నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ లోని కాత్యాయని సమేత ఏలేశ్వర మల్లికార్జున స్వామి ఆలయంలో క్రాంతి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో మహాశివరాత్రి ని పురస్కరించుకొని ఉపవాస దీక్ష విరమించిన శివ భక్తులకు పండ్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగార్జునసాగర్ టౌన్ ఎస్ఐ సంపత్ గౌడ్ హాజరయ్యారు, కాత్యాయని సమేత ఏలేశ్వర మల్లికార్జున స్వామి ఆలయ అర్చకులు పవన్ కుమార్ శర్మ ఎస్సై సంపత్ గౌడ్ కు ఆశీర్వచనాలు అందించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు, అనంతరం పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని ఎస్సై సంపత్ గౌడ్ ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో క్రాంతి యువజన సేవా సంఘం ప్రెసిడెంట్ శివ, సభ్యులు సాయి, సురేష్, శివ నాగులు, లింగయ్య, సైదులు, పవన్, హేమంత్, శివ భక్తులు పాల్గొన్నారు. ఎస్ఐ సంపత్ గౌడ్ మాట్లాడుతూ క్రాంతి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని సంఘం సభ్యులను అభినందించారు, ఆలయ అర్చకులు పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ 28- 2 -2025 వ తారీకు సాయంత్రం 6 గంటలకు కాత్యాయని సమేత ఏలేశ్వర మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామి వారి కళ్యాణం జరుగుతుందని కావున భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.