

జనం న్యూస్;27 ఫిబ్రవరి: గురువారం ;సిద్దిపేట నియోజికవర్గం ఇన్చార్జి; నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వారి సంచార పుస్తక పరిశ్రమ సిద్దిపేటలోని కూడళ్ళతో పాటుగా జిల్లాలో వివిధ ప్రాంతాలలో సంచరిస్తూ, పలు కళాశాలలు, పాఠశాలల్లో సృజనాత్మక రచనా కార్యశాలలు ఏర్పాటు చేస్తుందని నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా దక్షిణ భారత ఇన్చార్జి డాక్టర్ పత్తిపాక మోహన్ తెలిపారు. అందులో భాగంగా ఈనెల 28 రోజున ఉదయం 10 గంటలకు సిద్దిపేటలోని స్థానిక మల్టీపర్పస్ హైస్కూల్లో జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని, ఇట్టి కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, ప్రముఖ కథా రచయిత ఐతా చంద్రయ్య, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్, సృజన కార్యశాల విషయ నిపుణులు గరిపెల్లి అశోక్, సమ్మెట ఉమాదేవి, జంగిటి శాంతాకుమారి, ఉండ్రాళ్ళ రాజేశం తదితరులు పాల్గొంటారన్నారు. జిల్లాలోని కవులు, రచయితలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విచ్చేసి నచ్చిన పుస్తకాలు కొనుగోలు చేయగలరన్నారు