Listen to this article

* గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే మార్కాపురం వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ అన్నా వెంకట రాంబాబు.

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 11, (జనం న్యూస్):

ప్రకాశం జిల్లా, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే మార్కాపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అన్నా వెంకట రాంబాబు ఆధునిక రాజకీయాలలో ఒక విలక్షణమైన రాజకీయ దురంధరుడు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఎలాంటి రాజకీయ చరిత్ర లేని కుటుంబాన్ని నుంచి వచ్చి రెండు పర్యాయాలు గిద్దలూరు నుంచి శాసనసభ్యులుగా ఎన్నుకోబడి నియోజకవర్గస్థాయిలో అన్ని సామాజిక వర్గాలలో మంచి ఆదరణ గల నాయకుడిని చెప్పవచ్చు. ముక్కు సూటిగా మాట్లాడడం, అవినీతికి ఆమడ దూరంలో ఉండడం, అన్ని కులాలను సమాన భావంతో చూడడం, అందరినీ ఆప్యాయంగా పలకరించడం, ప్రజా సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టి తక్షణమే స్పందించి ఆ సమస్య కోసం పోరాడటం, విజయం కోసం చివరి వరకు పోరాడటం, విజయాన్ని ఓటమిని సమానంగా స్వీకరించడం, నిరంతరము అధికారం ఉన్న అధికారం లేకపోయినా ప్రజా సమస్యలపై పోరాడే ఆధునిక రాజకీయ నాయకులలో ఉన్నటువంటి సంపూర్ణ లక్షణాలు కలిగిన ఓ మంచి మనసున్న రాజకీయ నేత అని నిస్సందేశంగా చెప్పవచ్చు.అన్నా రాంబాబు తాము అధికారంలో ఉన్నంత కాలం నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రజారంజకంగా,అవినీతికి ఆమడ దూరంలో ఉంటూ అవినీతి రహిత పాలకులుగా నియోజకవర్గ ప్రజలలో గుర్తింపు ఉన్న నాయకుడని చెప్పవచ్చు.పార్టీకి విధేయులుగా, శాసనసభ్యులకు విధేయులుగా,పార్టీకి సేవ చేసిన వారిని గుర్తించి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి రాజ్యాంగ పదవులు,నామినేటెడ్ పోస్టులు, ప్రభుత్వ సంస్థలలో ఉన్నటువంటి వివిధ కాంట్రాక్ట్ పోస్టులు, నియోజకవర్గ స్థాయిలో జరిగే అభివృద్ధిలో వివిధ కాంట్రాక్ట్ వర్కులలోనైనా,ఒక్క రూపాయి ఆశించకుండా కార్యకర్తలకు, నాయకులకు, ఇచ్చిన ఒక గొప్ప మనసున్న రాజకీయ నాయకుడు అని నియోజకవర్గంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇప్పటికి గర్వంగా చెబుతున్నారటంలో అతిశయోక్తి లేదు.ప్రస్తుత ఆధునిక రాజకీయాలలో నిరంతరము కుట్రలు కుతంత్రాలతో ముడి పడిన రాజకీయం ఉంటుంది. కానీ అన్నా రాంబాబు ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కొని, మొండిగా ప్రజాబలంతో వెనుకడుగు వేయకుండా ముందుకు పోవడమే ఆయన రాజకీయ లక్షణం పార్టీని నమ్ముకొని, పార్టీకి విశ్వాస పాత్రులుగా ఉండే నాయకులను గుర్తించి వారిని ఆదరించడం ఆయన నైజం అని చెప్పవచ్చు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గుర్తించిన అతి కొద్దిమంది, ప్రజా బలముగల అవినీతి రహిత పాలకులలో మనమందరం అభిమానించే అన్నా వెంకట రాంబాబు ఉండడం గర్వకారణం అని చెప్పవచ్చు.అందుకే గిద్దలూరు మరియు మార్కాపురం నియోజకవర్గ ప్రజలు అన్నా రాంబాబును మొండివాడు గట్టివాడు అని అభివర్ణిస్తూ ఉంటారు.