

జనం న్యూస్ //ఫిబ్రవరి 27// జమ్మికుంట // కుమార్ యాదవ్.. వీణవంక కు చెందిన నీల నాగరాజు శ్రీలత ల పుత్రిక నీల వైష్ణవి 9వ జన్మదినం సందర్భంగా, జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో సుమారు 200 మందికి అన్నదానం, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చనతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైష్ణవి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అన్నపూర్ణ సేవా సమితి వారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. అలాగే నీల నాగరాజు శ్రీలత దంపతులకు ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు కుటుంబ సభ్యులతో పాటు పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.
