Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 28 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గుమ్మయ్య గారి పల్లిలో వెలసిన శ్రీ మారేమ్మ దేవి ఆలయంలో శ్రీ మారెమ్మ దేవి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బి దేవిరాజు స్వామి మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ మారెమ్మ దేవి ఆలయం 16 వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని దాతలు నాగమల్లేశ్వరి రామ్మోహన్ రెడ్డి సహకారంతో భక్తులకు చీరలు పంపిణీ చేశారుమహాశివరాత్రి సందర్భంగా మారెమ్మ దేవాలయంలో ఘనంగా శివపార్వతుల కళ్యాణోత్సవం గోపూజ మహిళా సత్సంగం అభిషేకం కుంభమేళ నుంచి తీసుకొచ్చిన గంగాజలం ను గ్రామస్తులకు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ప్రాంత గ్రామ వికాస్ సంయోజక్ తిరుపతయ్య హాజరయ్యారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బి దేవరాజు స్వామి, రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్, పుటక శంకర, పుటక ఈశ్వర ,ప్రతాపరెడ్డి, గిరిశంకర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, ఆలయ కమిటీ కమిటీ గ్రామ ప్రజలు ఆలయ సేవకులు పాల్గొన్నారు