Listen to this article

జనంన్యూస్. 28. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ వినాయక్ నగర్ లోని బస్వ గార్డెన్ లో తైక్వాండో ఇన్స్టిట్యూట్ నుండి. రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు జిల్లా నుండి 40 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు సబ్ జూనియర్. కాడేట్. జూనియర్ విభాగములలో ఎంపికైనట్టు తైక్వాండో కోచ్ మనోజ్ తెలిపారు. వీరు వచ్చే నెల మార్చి. న 1 నుండి 2 తేదీలలో హైదరాబాదులో యూసఫ్ గూడా లోని కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరగబోయే రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో వీరు పాల్గొననున్నట్టు నిజామాబాద్ జిల్లా తైక్వాండో ప్రధాన కార్యదర్శి కోచ్ మనోజ్ కుమార్ తెలిపారు. వినాయక నగర్ లోని బసవ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో క్రీడాకారుల వివరాలను వెల్లడించారు. స్టేట్ లెవెల్ నుండి నేషనల్ లెవెల్ కి వారు ఎంపిక అయ్యేవిధంగా నేర్పించినట్టు ఈ సందర్భంగా కోచ్ తెలిపారు