Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 28 కాట్రేనికొన గ్రంధి నానాజీ 50 సంవత్సరాల దాటిన ప్రతి టైలర్ కు పెన్షన్ సదుపాయం కల్పించాలని కాట్రేనికొన మండల టైలర్స్ యూనియన్ అధ్యక్షుడు, విత్తనాల వెంకట వర ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు వర ప్రసాద్ మాట్లాడుతూ మనుషుల అందాన్ని రెట్టింపు చేసే విధంగా దుస్తులు కుట్టేది ఒక దర్జీ మాత్రమేన్నారు.శుక్రవారం టైలర్స్‌ డే ను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కుట్టుమిషన్‌ సృష్టికర్త విలియం హౌం చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు, సంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలనితీర్మానించారు.పలు డిమాండ్ తో కూడిన వినతి పత్రాన్ని ఎంపిడివో, తహసిల్దార్ కార్యలయల్ల్లో సిబ్బందికి అందచేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సత్తిబాబు,భాష రామకృష్ణ,సుబ్బారావు,శ్రీను,గణేష్ వెంకటేశ్వర రావు, సతీష్ తదితరులున్నారు