

జనంన్యూస్. 28. నిజామాబాదు. సిరికొండ.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తూంపల్లి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వీడుకోలు సమావేశంలో భాగంగా హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని పదవ తరగతి విద్యార్థులకు చదువుని కష్టంగా కాకుండా ఇష్టపడి చదవాలని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని చదువు యొక్క ప్రాముఖ్యత గురించి ఫౌండేషన్ చైర్మన్ అయినాల శ్రీకాంత్.తెలియజేశారు. అనంతరం ఫౌండేషన్ వారు పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ అందజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సిరికొండ ఎంఈఓ రాములు.అలాగే ఉపాధ్యాయ బృందం పౌండేషన్ సభ్యులు యశ్వంత్,ప్రశాంత్,బాలరాజ్ పాల్గొన్నారు