

జనం న్యూస్; 28; ఫిబ్రవరి శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; సిడ్డిపేట పట్టణం భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయం లో సైన్స్ ఫెయిర్ ఘనంగా నిర్వహించారు.విద్యార్థులు వివిధ రకాల ఎగ్జిబిట్లు ప్రదర్శించారు.ఈ సందర్భముగా పాఠశాల ప్రిన్సిపాల్ యాళ్ల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఈ లాంటి ప్రదర్శనల వల్ల విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయవచ్చు అని చెప్పారు అదేవిధంగా ఎక్సహిబిట్ లు ప్రదర్శించిన విద్యార్థులను అభినందించారు ఎంపిక చేయబడిన ఎక్సహిబిట్ లకు ప్రథమ,ద్వితీయ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమములో కరెస్పాండంట్ లిఖిత ఉపాధ్యాయినీలు రత్నమాల,వాణిశ్రీ,దేవిక,కావేరి,భారతి,ఆర్షియా,అనురాధ, పాల్గొన్నారు.