Listen to this article

జనం న్యూస్ 01 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మూడు లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సంతృప్తికరంగా ఉందని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజామోదయోగ్యమైనదని ప్రశంసించారు. గత వైసీపీ ప్రభుత్వ బడ్జెట్‌ కొందరికి మాత్రమే లాభదాయకమైనదిగా ఉండేదన్నారు. వ్యవసాయరంగానికి పెద్దపీట వేశారన్నారు. సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చేరన్నారు. ప్రధానంగా అధికారంలోకొచ్చేందుకు దోహదపడ్డ సూపర్ సిక్స్ పథకాలకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేయడం అభినందనీయమన్నారు. కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేలా ఏపీ బడ్జెట్‌ కేటాయింపులు చేసేరన్నారు. ఆర్థిక లోటు ఉన్నా కూడా సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పోలవరం, అమరావతికి భారీ కేటాయింపులు చేయడం హర్షనీయమన్నారు.