Listen to this article

జనం న్యూస్ 1మార్చ్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. జైనూర్ :ఎలాంటి అనుమతులు లేకుండ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు జైనూర్ ఎస్సై సాగర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా ఝరి వైపు నుండి వస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్నామని ఇసుకకు సంబంధించిన ఎలాంటి అనుమతులు లేకపోవడంతొ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ ఝరి గ్రామానికి చెందిన డి.హనుమండ్లు ట్రాక్టర్ యజమాని ఇస్మాయిల్ లను విచారించి ఇద్దరిపై కేసు నమోదు చేసి ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్సై సాగర్ తెలిపారు. ఎవరైనా అనుమాతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చంచారు.