Listen to this article

జనం న్యూస్ మార్చ్ ఒకటి అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 2024 ఎన్నికల ప్రకటించిన వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుగా అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా కొత్తమావాస్య జాతరను రాష్ట్ర పండుగగా జరిపిస్తామని చెప్పిన ప్రకారం నేడు శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలుసుకొని విజ్ఞాపన మేరకు సానుకూలంగా ముఖ్యమంత్రి ప్రకటన వల్ల శ్రీశ్రీశ్రీ నూకాంబికా అమ్మవారి భక్తుల లో నూతన ఉత్సాహంతో ఆనందోత్సవం వ్యక్తపరుస్తున్నారని తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ కొణతాల వెంకటరావు హర్షం వ్యక్తపరిచారు. 2015 లో ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబునాయుడు అమ్మవారిని దర్శించుకున్నారని, అమ్మవారి దర్శనం అనంతరం దేవస్థానo స్థితిగతులు చంద్రబాబుకు నాటి శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ వివరించిన తర్వాత ఆ క్షణంలో ఐదు కోట్లు ప్రకటించారని,ఆదేశాలు జారీ చేసిన ప్రకారం ఆనాటి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సాంబశివరావు ఐఏఎస్ ఫైల్ క్లియర్ చేసి ఐదు కోట్లు చెక్కు విడుదల చేశారు. అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రెండోసారి అమ్మవారి దర్శనం చేసుకొని మరో ఐదు కోట్లు ప్రకటించారని, కోర్టు వివాదం వల్ల రెండవసారి ప్రకటించిన చేసిన 5 కోట్లు విడుదల కాలేదని వెంకటరావు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ నూకాంబిక అమ్మవారు ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవంగా కొలిచేవారని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నాటి శాసనసభ్యులు దాడి వీరభద్రరావు కృషి ఫలితంగా అభివృద్ధి కార్యక్రమాలు భక్తులకు సౌకర్యాలు మెరుగుపరిచిన ఆదాయ వనరులను సమకూర్చామని వెంకటరావు అన్నారు . తర్వాత దేశ విదేశాల నుండి అనేక మంది భక్తులు అమ్మవారికి దర్శనానికి విచ్చేసి దేవస్థానం అభివృద్ధిలో మలేషియా దేశానికి చెందిన పూర్వం అనకాపల్లి ప్రాంత వాస్తవ్యులు అమ్మవారి దర్శనంకి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించి తమ వంతు సహకారం అందించారని, అలాగే విదేశాల నుండి వివిధ దేశాల నుండి విచ్చేసిన వారు కూడా అమ్మవారి హుండీలో కానుకలు సమర్పించి దేవస్థానం అభివృద్ధికి సహకరించారని, నేడు కూటమి ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి తో శ్రీ నూకాంబితా అమ్మవారి జాతర గురించి సంప్రదించి, అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ను రాష్ట్ర పండుగగా చేయడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా శాసనసభ్యులు రామకృష్ణ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ కోరగా ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి ఆదేశాలు జారీ చేశారని, సాధ్యసాద్యాలు పరిశీలనను చేసి తగిన చర్యలు తీసుకొని, ముఖ్యమంత్రి కార్యాలయం కు సమర్పించమని ముఖ్యమంత్రి పిఏ రవిచంద్ర కు చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారని వెంకటరావు అన్నారు. శ్రీ నూకంబిక అమ్మవారు కొత్త అమావాస్య జాతర ను అంగరంగ వైభవంగా నిర్వహించాలని పట్టుదలతో శాసనసభ్యులు రామకృష్ణ ఉన్నారని, గతంలో మంత్రి హోదాలో దేవస్థానంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నారని, రానున్న నాలుగు సంవత్సరాలలో దేవస్థానo రూపురేఖలు సమూలంగా మార్పులు చేయడానికి, భూ సేకరణ చేసి భక్తులకు మరిన్ని సౌకర్యవంతమైన కార్యక్రమాలు చేయడానికి నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేస్తున్నారని వెంకటరావు ఈ సందర్భంగా తెలియజేశారు. మరోసారి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు వెంకటరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ బిజెపి నాయకులు బొడ్డేడ అప్పల నరసయ్య పాల్గొన్నారు. హర్షం ప్రకటించిన వారు మల్ల గణేష్ పొలిమేర నాయుడు కుప్పిలి జగన్ విల్లూరి రమణబాబు పెంటకోట శివరాం బీవీఎస్ అప్పారావు కాండ్రేగుల రవీంద్ర వేదుల సూర్యప్రభ కోట్ని ఉమా కాయల ప్రసన్న లక్ష్మి శంకర్ల పద్మలత బీశెట్టి హేమ కూరాకుల భారతి మల్ల రామకృష్ణ యలమంచిలి బంగారు రాజు పెంటకోట వెంకటరమణ పిల్లా తారకేష్ కాండ్రేగుల జగదీష్ విల్లూరి సత్తిబాబు విల్లూరి అప్పలనాయుడు తదితరులు హర్షం ప్రకటించారు.