

జనం న్యూస్ ఫిబ్రవరి 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి : శాయంపేట మండల కేంద్రంలోని ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మొత్తం సుమారు 69 మంది ఓటర్లు గాను 68 మంది ఓటు వేశారు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సీఐ రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేష్ ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు కాగా మండలంలో 98.55 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు పోలింగ్ కేంద్రాన్ని ఆర్డీవో నారాయణ పరకాల ఏసీపీ సతీష్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కల్వల సత్యనారాయణ ఆర్ఐ రమేష్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మడికొండ రత్నాకర్ పాల్గొన్నారు….