

కంపెనీ తెరిచి కార్మికులకు జీతాలు ఇవ్వాలని సీఐటీయూ డిమాండ్ జనం న్యూస్,మార్చి01, అచ్యుతాపురం;అచ్యుతాపురం సెజ్ పరిధిలో ఉన్న సాల్వియాస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను తెరిపించి కార్మికులకు ఇవ్వవలసిన మూడు నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని పరిశ్రమ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. రాము,అచ్యుతాపురం మండల కన్వీనర్ కే . సోమనాయుడు మాట్లాడుతూ ఫార్మా పరిశ్రమ అర్థాంతరంగా మూసివేయడంతో 60 మంది కార్మికులు రోడ్డున పడ్డారని, వీరికి ఇవ్వవలసిన మూడు నెలలు బకాయి జీతాలు, చట్ట ప్రకారం రావలసిన అన్ని బకాయిలు ఇవ్వాలని ప్రభుత్వం, లేబర్ అధికారులు స్పందించి పరిశ్రమను తెరిపించి ఉపాధి కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మురళి, నగేష్, హరి కార్మికులు పాల్గొన్నారు.