

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 1 రిపోర్టర్ సలికినిడి నాగరాజు మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లో పర్యటన చేసి వరికిపూడిశెల ప్రాజెక్టును తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని హామీ ఇచ్చారని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి.శ్రీను నాయక్ అన్నారు. పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్లోనే గల సంఘం కార్యాలయంలో శనివారం ఆయన ట్లాడుతూ ఆనాడు హామీ ఇచ్చిన లోకేష్ బాబు ఈరోజు ఎందుకు మౌనం వహిస్తున్నారని పలు ప్రశ్నలు సంధించారు. ఆ తరువాత ఎన్నికల్లో ఎమ్మెల్యేలు తమకు ఓట్లు వేసి గెలిపిస్తే ప్రాజెక్టును పూర్తి చేయిస్తామని చెప్పి ఈనాడు కనీసం ప్రజలకు సమాధానం చెప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన తండాల్లో నీరు లేక, గునీరు లేక వ్యవసాయం మానివేసి భూములు అమ్ముకుంటున్నారు. ఇచ్చిన హామీని అమలు చేసి గిరిజన డాలకు సాగునీరు, తాగునీరు అందించకపోతే ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమం చేయవలసి వస్తుందని హెచ్చరించారు.