


జనం న్యూస్ 1మార్చ్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. ఆసిఫాబాద్ సబ్ డివిజన్ లోని అన్ని బ్యాంకుల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపిఎస్ ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపిఎస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆసిఫాబాద్ సబ్ డివిజన్ లోని అన్ని బ్యాంకుల అధికారులతో సమావేశమయ్యారు. ఇటీవల పలు ప్రాంతాలలో బ్యాంకులలో జరిగిన దొంగతనాలను ఉద్దేశించి, అలాంటి సంఘటనలు ఆసిఫాబాద్ సబ్ డివిజన్ నందు జరగకుండా బ్యాంకు అధికారులు తమ తమ బ్యాంకులకు సంబంధించి పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్యాంకుల లోపల మరియు వెలుపల అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బ్యాంకులలో ఉండే సెక్యూరిటీ అలారం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ATM లలో నగదును లోడ్ చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, అక్కడ సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సూచించారు. సామాజిక బాధ్యతలో భాగంగా సైబర్ క్రైమ్స్ పై బ్యాంకుల తరఫునుండి కూడా జిల్లా ప్రజలకు నిత్యం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐలు రవీందర్, రమేష్, సత్యనారాయణ , ఎస్ఐ లు చంద్రశేఖర్, సాగర్, శ్రీకాంత్, విజయ్ ,ప్రశాంత్,
బ్యాంకు కంట్రోలర్స్, బ్యాంకు మేనేజర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
