

జనం న్యూస్ 01 మార్చ్ (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురి మెల్ల శంకర్ )
ఈ రోజు టీజెస్ రాష్ట్ర కార్యాలయంలో సింగరేణి కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమైన శాసనమండలి సభ్యులు, టీజెస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం గారు, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి సూచనలు ఇచ్చారు. అలాగే, ఆదివాసీ సంఘాల ప్రతినిధులతో సమావేశమై వారి అంశాలపై చర్చించి, మార్చి 8న ఆదిలాబాద్‌లో జరగనున్న అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వినతిపత్రాలను స్వీకరించి, సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కారానికి సిఫార్సులు చేశారు.
