

జనం న్యూస్ 02 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:మహిళా సాధికారత, అభివృద్ధి, సమానత్వం కోసం అందరం కృషి చేద్దామని ఎస్పీ వకుల్ జిందల్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ… జిల్లావ్యాప్తంగా మహిళా దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.