

జనం న్యూస్ 02 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ :సుదీర్దకాలం పోలీస్ శాఖలో బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డు బొత్స సుందరరావు ను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందల్ శనివారం ఘనంగా సత్కరించారు. క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసి ఇతర ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచారని ఎస్పీ కొనియాడారు. అనేక సవాళ్లను ఎదుర్కొని 37 సంవత్సరాలు పనిచేయడం అభినందనీయమన్నారు.కార్యక్రమంలో హోంగార్డ్స్ ఇన్‌ఛార్జ్ రమేష్ పాల్గొన్నారు