

జనంన్యూస్. 02.నిజామాబాదు. సిరికొండ. ప్రతినిధి.సిరికొండ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మొట్టల దీపక్. ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణాలర్పించిన మాదిగ మహనీయులకు సిరికొండ మండల కేంద్రం లో కొవ్వోతులతో నివాలులు అర్పించి శ్రద్ధాంజలి కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్. జిల్లా సీనియర్ నాయకులు. నక్క రాజేందర్ పాల్గొన్నారు, నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో మాదిగల శాతం ఎక్కువ ఉన్నందున జనాభా ప్రతిపాదన నిష్పత్తి ప్రకారము 9% రాష్ట్ర ప్రభుత్వము రిజర్వేషన్ ప్రకటించింది దానిని నిలిపివేసి 11 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము మార్చి 10 నుండి రాష్ట్ర ప్రభుత్వము జీవోను అమలు పరుస్తామని ప్రకటించింది దానిని ఉపసంహరించుకొని 11 శాతం పెంచి జీవోను అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమం లో బోడ గణేష్, కానపురం ప్రవీణ్, బోడా నర్సింగ్‌రావు,గొర్రె బొర్రన్న, కానపురం కిషోర్, గొర్రె రఘు, బోడా నవీన్,పిప్పెరా రంజిత్, రావుట్ల ప్రేమ్, చిట్యాల శ్రవణ్, బట్టు సాయిలు, అయినాల సురేష్, అయినల రాజు, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.