Listen to this article

జనం న్యూస్ // మార్చ్ // 2 //జమ్మికుంట // కుమార్ యాదవ్..02 03 2025 న జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దివంగనేత దుద్దుల్ల శ్రీపాద రావు, 88వ జయంతిని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్, ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదే విధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మలుగూరి సదయ్య, ఆధ్వర్యంలో పట్టణంలోని శివాలయం లో శ్రీపాదరావు జయంతి సందర్భంగా అన్నదానం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మలుగూరి సదయ్య, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గూడెం సారంగపాణి, మదన్ రావు, మరియు మాజీ ఐ ఎన్ టి యు సి నాయకులు లింగంపల్లి లింగారావు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాతకాల రమేష్, దొడ్డ నవీన్, పంజాల అజయ్ గౌడ్, రాజు, రమేష్, సుధాకర్, అనిల్, కమలాకర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.