Listen to this article

సీతక్క సొంత జిల్లాలో మొగ్గ దశలోనే కాటికి చేరిన పసికందు భద్రాచలం నియోజకవర్గ అసెంబ్లీ బి ఎస్ పి సోషల్ మీడియా ఇంచార్జ్ జనగాం కేశవరావు మార్చీ 3 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండల ప్రాధమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోగల మండపాక కొత్త గుడిసెల్లో నివాసముంటున్న నిరుపేద దళిత కుటుంబమైన గోగు లకృష్ణ,భారతి ల మూడవ సంతానం జమున 55 రోజుల చిన్నారి ప్రాణం గాలిలో కలిసింది బహుజన సమాజ్ పార్టీ భద్రాచలం నియోజకవర్గం సోషల్ మీడియా ఇంచార్జ్. జనగాం కేశవరావు మాట్లాడుతూ.. నెలతప్పిన రోజు మొదలకుని నవమాసాలు మోచి కన్నా తల్లికి సంతోషం లేకుండాపోయిందని కంటినిండా శోకమే మిగిలిందని , ప్రజా పాలనలో బహుజనులకు రాష్ట్ర వ్యాప్తంగా ఏమాత్రం ప్రభుత్వ వైద్యం అందడంలేదన్నారు.45 రోజులకే వెయ్యాల్సిన టీకా (వ్యాక్సిన్ ) ములుగు జిల్లా ఆసుపత్రి నుండి రాకపోవడం చాలా బాధాకరం అని వైద్యుల నిర్లక్ష్యం వలెనే పాప చనిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం సారు.అధిపథ్య రాజకీయనాయకులకు తుమ్ము వచ్చిన దగ్గు వచ్చిన కార్పొటేట్ ఆసుపత్రులకు వెళ్తారని,మరి నిరుపేద బహుజన ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి మాత్రమే దిక్కు అని మరి ఇక్కడ సరైన సమయానికి మంధులు అందించకుండా ఆరోగ్య శాఖ ఎం చేస్తుందని ఆయన మండిపడ్డారు తక్షణమే సమందిత అధికారులను సస్పెండ్ సేసి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు