

జనం న్యూస్ 4 ఆలేరు యాదాద్రి జిల్లా (మండల్ రిపోర్టర్ ఎండీ జహంగీర్) ఆలేరు మండలంలోని కోలనపాక గ్రామంలో మహిళలను హైదరాబాద్ వేదికగా జరిగే ప్రపంచ అందాల పోటీలను వ్యతిరేకించాలి అని పి ఓ డబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి రాచకొండ సీత అన్నారు అనంతరం మాట్లాడుతూ మహిళలను అంగడి సరుకుగా చేసి పోటీల పేరుతో నిర్వహించే మార్కెట్ మాయ జాల అందాల పోటీలు పెట్టి, తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకోవడానికి కార్పోరేట్ శక్తులు, ప్రభుత్వాలు కలసి మహిళలని అన్ని రకాలుగా అణచివేతకు గురి చేయడానికే అందాల పోటీలు నిర్వహిస్తున్నారనహైదరాబాదులో మే 8 న జరిగే ఈ అందాల పోటీలకు వ్యతిరేకంగా అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం(పి ఓ డబ్ల్యు) నాయకులు గడ్డం నిర్మల, పైస కిష్టమ్మ, బొంకూరి లక్ష్మీ, కొంగరి యాదమ్మ, గడ్డం మంజుల,తలారి జ్యోతి, మామిడాల లావణ్య, మామిడాల లక్ష్మీ, గందమల్ల దేవమ్మ, గందమల్ల పుష్ప, మామిడాల రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.