

(జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్) జనం న్యూస్, మార్చ్ 4, జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరికి యత్నించిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు సబ్ రిజిస్టార్ ఆఫీసులోకి చొరబడి చోరీకి యత్నించారు. ఉదయం కార్యాలయం తెరిచేందుకు వచ్చిన సిబ్బంది చోరీ ఘటన గుర్తించి సబ్ రిజిస్టార్ కు సమాచారం ఇచారు. జగిత్యాల సబ్ రిజిస్టార్ సుజాత ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. విలువైన పత్రాల కోసం చోరీకి యత్నించినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.