

కోటగిరి పొతంగల్ మండలంలోని ప్రతి గ్రామంలో ప్రజలకు అండగా ఉన్నారు నిరుపేద మధ్యతరగతి ప్రజలకు భరోసా ఇస్తూ ఆర్థిక సాయం ఇస్తూ అందరి గుండెల్లో నిలుస్తున్నారు
జల్లాపల్లి నుంచి పుట్టిన అన్నదమ్ములు ప్రజాసేవలోనిత్యం
ఎంఏ హకీమ్ ఎమ్ఏ రజాక్ ల సేవలు అద్భుతం అని ప్రజల హర్షం
పొతంగల్
జలపల్లి
నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం జల్లపల్లి గ్రామం ఆ గ్రామంలో ఇద్దరూ అన్నదమ్ములు ప్రజల సేవలో అనునిత్యం ఉండటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని మాటలు పక్కన పెడుతున్నారు ఆ ఇద్దరు అన్నదమ్ములు జల్లపల్లి గ్రామం తో పాటు పొతంగల్ మండలం తో పాటు కోటగిరి మండలం తో పాటు ప్రతి మండలంలో ఆ ఇద్దరు అన్నదమ్ములు ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటున్నారు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఆపదలో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారు నిరుపేద మధ్యతరగతి వారికి వారు అండగా ఉంటూ ఆర్థిక సాయం చేస్తూ భరోసా ఇస్తున్నారు ఆ ఇద్దరు అన్నదమ్ములు, ఆ ఇద్దరు అన్నదమ్ములను కన్నా తల్లితండ్రుల కు ప్రజలంతా వందనాలు తెలియజేస్తున్నారు. వారు ఎంఏ హకీం భాయ్ ఎంఏ రజాక్ బై, అనేక ఏళ్ల నుంచి ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా ప్రజల ముంగిట ప్రజాసేవలో వారు ఉండడం హర్షదాయకం అని ప్రజలు కొనియాడుతున్నారు. ఆపదలు ఉన్నవారికి కష్టాల్లో ఉన్న వారికి అధైర్య పడకండి మేమున్నామంటూ ఎప్పటికప్పుడు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. సహాయం పొందిన ప్రతి ఒక్క ప్రజలు దేవుడితో సమానంగా కొలుస్తున్నారు. ఇలాంటి దేవుడితో సమానమైన సహాయ సహకారాలు అందించే మనుషులు మన వద్ద ఉండడం గర్వకారణం అని ప్రజలు కొనియాడుతున్నారు. కనిపించని దేవుడు ఉన్నాడా లేదా తర్వాత విషయం కానీ కనిపించే వీరు మాత్రం ప్రజలకు సేవలు అందించడం గొప్ప వరం లాంటిదని ప్రజలు కొనియాడుతున్నారు. కుల మతాలకు అతీతంగా ఆపదలు ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం అందించడం గర్వకారణం అని వారి సేవల పట్ల మంత్రముగ్ధమవుతున్నారు ప్రజలు.జల్లాపల్లి నుంచి మక్కాకు వెళ్లే భక్తులకు 12 లక్షలు అందజేతపవిత్రమైన దైవదర్శనం కోసం పొతంగల్ మండలం జల్లపల్లి గ్రామం నుంచి భక్తులకు 12 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు అన్నదమ్ములు ఇద్దరు,ఈ సందర్భంగా గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి వారికి సన్మానం చేసి మక్కాకు సాగనంపారు. దైవ దర్శనం కోసం వెళ్లే భక్తులకు 12 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మీడియా, పత్రికా తనకు ప్రాణం లాంటిదిమీడియా పత్రిక తనకు ప్రాణం లాంటివి అని ఎం ఏ హకీం భాయ్ అన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు మీడియా పత్రికను మరువబోనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తాను ఈ స్టేజిలో ఉన్నాను అంటే మీడియా పత్రిక అంటూ గుర్తు చేయడం హర్షదాయకమని ఆయన బాటలోనే మీడియా పత్రిక అంటే తనకు గౌరవం అని అన్నారు. మీడియా పత్రికా లేకుంటే అన్ని అంధకారమే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో , టిఆర్ఎస్ ఇస్మాయిల్, మాజీ,ఎంపీటీసీ రాములు, షేరు, రజాక్, సోయల్, దేవ్ సింగ్, రాములు, తదితరులు పాల్గొన్నారు