అంగరంగ వైభవంగా రేణుక ఎల్లమ్మ బోనాలు వేడుకలు

మాజీ యూత్ కాంగ్రెస్ జహీరాబాద్ మండల్ ప్రెసిడెంట్ మేకల రాములు
జనం న్యూస్ 22 జూలైనియోజకవర్గ పట్టణ పరిధిలోని రాంనగర్ కాలనీలో మాజీ యూత్ కాంగ్రెస్ జహీరాబాద్ మండల్ ప్రెసిడెంట్ మేకల రాములు ఆధ్వర్యం లో అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు ఘనంగా నిర్వ హించారు. మానవ జీవన విధానానికి సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక నిలిచిన బోనాల పండుగ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మంగళ వారం నాడు పలు కాలనీ లలో రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు కిక్కిరిసి పోయారు. ఉదయం నుంచి ఆలయం వద్ద ఆధ్యాత్మిక వాతా వరణం సంతరించు కుంది. సకల జనులను చల్లగా చూడు తల్లి అంటూ అమ్మవారికి అంటూ మహిళలు అమ్మవారి బోనాలు సమర్పించు కున్నారు. ఆషాడ మాసంలో ఈ బోనాలు పండుగను ఈ రాష్ట్రంలోని ప్రతి పల్లెలోని కాలనీలలో పట్టణాల్లోనూ జరుపుకోవడం జరుగు తుంది. ఈ బోనాలు పోతరాజుల ఆటపాటలతో ఖాజా భజంత్రీల నృత్యాలు చేస్తూ ఇంటింటి బోనాన్ని తీసుకొని రేణుక ఎల్లమ్మ ఆలయా నికి చేరుకుంటారు. అనంతరం అమ్మవారు ఆలయం దగ్గర తీర్థ ప్రసాదాలు భోజనాలు స్వీకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎం బాలప్ప,సి నర్సింలు, తిరుమలి, వెంకటేష్, సి బాలరాజ్, ఏం రమేష్, మేకల రాజు, మేకల కిష్టప్ప కాళివాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.