జనం న్యూస్ సెప్టెంబర్ 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ మహా అభియాన్’లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి కోరారు.. దేశసేవ కోసం ప్రధాని నరేంద్ర మోడీ తన జీవితాన్ని త్యాగం చేశారని.. ఈరోజు వికసిత భారత్ గా దేశం పయనిస్తుంది అంటే దానికి కారణం మోదీయేనని అన్నారు.. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 76వ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెలరోజుల పాటు ‘సేవా సంకల్ప అభియాన్’ నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజాసేవ, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, రక్తదానం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవ వంటి కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు.. సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా సమాజంలోని పేదలు, నిరుపేదలు, వృద్ధులు, మహిళలు, యువత, గిరిజనులు తదితర వర్గాలకు అండగా నిలిచి సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని కోరారు.. ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించే సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో సేవాభావం మరింత బలపడుతుందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలను కేవలం ఉత్సవాలకే పరిమితం చేయకుండా ప్రజాసేవకు అంకితం చేయడం ఒక్క బీజేపీకే సాధ్యం అని డాక్టర్ ఏలూరి అన్నారు.