ఆంధ్రప్రదేశ్

బీ.ఫార్మసీలో మెట్‌పల్లి విద్యార్థికి యూనివర్సిటీ గోల్డ్ మెడల్

బీ.ఫార్మసీలో మెట్‌పల్లి విద్యార్థికి యూనివర్సిటీ గోల్డ్ మెడల్

ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత. ఫార్మ్-డీలో ఉచిత సీటు సాధించిన ఇమ్రాన్జ నం న్యూస్ | నవంబర్ 11, జగిత్యాల జిల్లా : మెట్‌పల్లి జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ (బీ. ఫార్మసీ)లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, యూనివర్సిటీ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి పట్టణానికి గర్వకారణంగా నిలిచాడు. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) ఇటీవల నిర్వహించిన పరీక్షల ఫలితాల్లో ఇమ్రాన్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. యూనివర్సిటీ తుది ఫలితాల్లో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల మెట్‌పల్లి పట్టణానికి చెందిన విద్యావంతులు, మేధావులు, పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ ఇమ్రాన్‌కు అభినందనలు తెలిపారు. అంతేకాకుండా, తన ప్రతిభతో తదుపరి ఉన్నత విద్య అయిన ఫార్మ్-డీ (డాక్టర్ ఆఫ్ ఫార్మసీ) కోర్సులో ఉచిత సీటును కూడా సాధించడం విశేషం. ఒకవైపు యూనివర్సిటీ స్థాయిలో బంగారు పతకం, మరోవైపు ఉన్నత విద్యకు ఉచిత సీటు సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు. భవిష్యత్తులో ఫార్మసీ విద్యలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, వైద్య రంగంలో విశేష సేవలందిస్తూ సమాజానికి ఉపయోగపడాలని పట్టణ ప్రముఖులు ఆకాంక్షించారు. ఇమ్రాన్ సాధించిన ఈ విజయం యువతకు ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.

ఇ-పేపర్