అయిజ పట్టణంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే డాక్టర్అబ్దుల్ కలాం11వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు
జనం న్యూస్ 27 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ లో ఉన్న ఆయన విగ్రహానికి 11వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉపాధ్యక్షులు పిజికె గోవింద్ రాజ్ ఆధ్వర్యంలో ఏపిజె డాక్టర్ అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలతో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ అబ్దుల్ కలాం గురించి కలాం గొప్ప మహోన్నత వ్యక్తి ఆయన ఉపాధ్యాయ వృత్తి నుండి శాస్త్రవేత్త దాక ఎదిగి ఎన్నో పరిశోధనలు చేసి రాకెట్లను ఇతర దేశాల వలె మన భారతదేశాన్ని ప్రపంచంలో గుర్తింపు వచ్చే విధంగా చేశాడని ఆయన భారతదేశానికి చాలా సేవలు చేశాడని ఆయన ఆశలను కొనసాగింపు దశగా మనమందరము కృషి చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నేటి యువత అబ్దుల్ కలాం వలె ఉన్నత విద్య అభ్యసించి దేశంలో ఉన్నతమైన గుర్తింపు పొందిన పనులు చేసి దేశానికి ఊరికి గర్వకారణంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూర్ ఉప్పరి గంగాధర్ జోగులాంబ గద్వాల జిల్లా మీడియా ఇంచార్జ్ యు రాముడు అయిజ మండల కార్యకర్తలు బరిగేల గోవింద్ యు ఆంజనేయులు లింగాపురం బి హనుమంతు యు ప్రనేష్, తదితరులు పాల్గొన్నారు.