ఆ GO(1243)వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనే:-పల్లె గ్రీస్మంత్ రెడ్డి
సబ్ టైటిల్ తల్లికి వందనం కోసం, దేవాదాయ శాఖ నిధులు తీసుకోవడాన్ని తప్పుబట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందలూరు మండల యువ నాయకులు పల్లె గ్రీష్మంత్ రెడ్డి
తల్లికి వందనం* కోసం దేవాదాయ శాఖ ద్వారా రూ.26.3 కోట్లు* విడుదలకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆదేశాలు(GO-1243) జారీ చేయడాన్ని నందలూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు పల్లె గ్రీష్మంత్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తప్పుపట్టారు.బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణ విద్యార్థులకు వీటిని ఇస్తున్నట్లు GO లో అధికారి కంగా పేర్కొన్నారని, దేవాలయ నిధులు బ్రాహ్మణ కార్పొరేషన్ పేరుతో తల్లికి వందనం కోసం ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు??దేవాలయాల నిధులు ధార్మిక కార్యక్రమాలకు, వేద విద్యకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉండగా ప్రభుత్వ పథకాలపై ఎలా ఖర్చు చేస్తారని, ఇది చట్ట విరుద్దమని తెలిపారు.సనాతన ధర్మ పరిరక్షకులం, హిందూ మతం కోసం పని చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే జనసేనాని మరియు BJP పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ GO పై నోరు మెదపకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు…వెంటనే ఈ ఆదేశాలను కూటమి ప్రభుత్వం ఉపసంహరించు కోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.