జనం న్యూస్ సెప్టెంబర్ 21 వేములపల్లిలక్ష్మీదేవి గూడెం లో గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచి,ఎలీకట్టి భరత్ , ఉపసర్పంచి గంట స్వాతి ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పదని అన్నారు.అన్నదానం మహాదానం అని సర్పంచ్ అన్నారు. ఆ గణేశుని ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఉండాలని కమిటీ సభ్యులు గణపతి మహరాజ్ని వేడుకున్నారు. అన్నదాన కార్యక్రమం సందర్భంగా ఘనంగా పూజ నిర్వహించారు. పంతులు సూర్య కుమార్ శర్మ చాలా భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఆ దేవుడి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎల్లప్పడికి ఉండాలని కార్యక్రమాన్ని నిర్వహించారు.కమిటీ సభ్యులకు అన్నదాన కార్యక్రమనీ భక్తిశ్రద్ధలతో చాలా చక్కగా నిర్వహించినందుకు సర్పంచి ,ఉపసర్పంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.