ఆంధ్రప్రదేశ్

ధనలక్ష్మి ధైర్యలక్ష్మిరాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం

ధనలక్ష్మి ధైర్యలక్ష్మిరాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం

జనం న్యూస్ నవంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రజా ప్రతినిధిగా రాజకీయాలను శాసించి, ప్రజా ప్రతినిధిగా ప్రజల మన్నన పొందిన మత్స్య శాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వరరావు సతీమణి ధనలక్ష్మి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో మేజర్ పంచాయతీల్లో ఒకటైన కాట్రేనికోన సర్పంచ్ గా కూటమి మద్దతుతో బరిలోకి దిగనున్నారు. భర్తకు అండగా: నాగిడి నాగేశ్వరరావు గెలుపొందిన పదవుల్లో ఆయన భార్యామణి కృషి అమోఘమైంది. తాను వంటింటి కుందేలును కాదని అనేకసార్లు రుజువు చేశారు. ఎప్పటికప్పుడు మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న పరిస్థితులను ఆరా తీస్తుంటారు. రాజకీయ చతురత ప్రదర్శిస్తూ తనదైన శైలిలో స్పందిస్తుంటారు. విజయం తథ్యం: ప్రస్తుత తరుణంలో పంచాయతీ సర్పంచ్ గా ఆమె గెలుపు అంత కష్టమేమీ కాదు. రాజకీయంలో సుదీర్ఘ అనుభవం కలిగిన భర్త నాగేశ్వరరావు సూచనలు ఆమె చతురత కలిపి విజయానికి బాటలు వేస్తాయి.

ఇ-పేపర్