ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలి

July 27, 2026 | వైరల్ వార్తలు

ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బ్రహ్మారెడ్డి

జనం న్యూస్- జులై 27- నాగార్జునసాగర్ టౌన్-తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం (టియుఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణ బ్రహ్మానందరెడ్డి అన్నారు, సోమవారం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన,ముందుగా జిల్లా కమిటీ,నాగార్జునసాగర్ కమిటీ, జర్నలిస్ట్ ఫోరం సభ్యులతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు,అనంతరం నాగార్జునసాగర్ లోని తన నివాసంలో స్థానిక ఉద్యమకారుల తో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు,ఈ సందర్భం గా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ కారుల ఆశయాలను సాధించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలి ఇప్పటికే పలువురు ఉద్యమకారులు మరణించగా అనారోగ్యం తో ఉద్యమ కారుల జీవితాలను కోల్పోతున్నారు,ఇప్ప టికైనా ప్రభుత్వం గుర్తించి,అర్హులైన ఉద్యమకారు లందరికీ గుర్తింపు కార్డులు,సంక్షేమ పథకాలు అందించాలని కోరారు.అనంతరం రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యులు సిరికొండ మధు,జిల్లా కార్యదర్శి చెంగలి జంగన్న,మాట్లాడుతూ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలన్నింటినీ ఉద్యమకారు లందరికీ తక్షణమే అమలు చేయాలి 250 గజాల ఇంటి స్థలం,25 వేల పెన్షన్,మరియు మెరుగైన వైద్యం కోసం హెల్త్ కార్డులు,బస్సు సదుపాయం రాష్ట్రవ్యాప్తంగా,అలాగే ట్రైన్ సదుపాయం అందించాలని కోరారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షుడు జర్నలిస్టు ఫోరం జిల్లా నాయకులు ప్రకాష్ ముదిరాజ్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇచ్చిన ఇతర హామీలను కూడా తక్షణమే అమలు చేయాలని , ఎలక్షన్ల సందర్భంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కె.కె.ఉద్యమ గుర్తింపు కార్డు కమిటీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.ఈ కార్యక్రమంలో పెద్దవూర మండల అధ్యక్షులు చెరుకుపల్లి వాసు, ప్రధాన కార్యదర్శి ఊర శ్రీను,నందికొండ పట్టణ ప్రధాన కార్యదర్శిభూష రాజుల కృష్ణయ్య,నాయకులు చంద్రయ్య, జర్నలిస్ట్ ఫోరం నాయకులు కోడా అప్పారావు, యోబు రాజు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper