
జనం న్యూస్ 21 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, రహదారుల అభివృద్ధి విద్యుత్ వైద్య మరియు ఆరోగ్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలి కాలానుగుణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి. నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి. అలంపూర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను ఎమ్మెల్యే విజయుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు
