ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం భారత స్వాతంత్రం

August 15, 2026 | తెలంగాణ

కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు బుచ్చిరెడ్డి

జనం న్యూస్ ఆగస్టు 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం గానే దేశ స్వాతంత్రం సిద్ధించిందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు 80 వ దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ మండల పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ దేశ ప్రజల స్వాతంత్ర్య కాంక్షలు నెరవేర్చి అమరులైన త్యాగమూర్తులకు శిరస్సు వంచి నమస్సుమాంజలు అర్పిస్తున్నామన్నారు దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుతూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు చల్ల చక్రపాణి మారేపల్లి రవీందర్ చిట్టి రెడ్డి రాజిరెడ్డి అబ్బు ప్రకాశ్ రెడ్డి చిందం రవి నిమ్మల రమేష్ దుబాసి కృష్ణమూర్తి కొమ్ముల భాస్కర్ ఎండి హైదర్ రఫీ బూర రమేష్ వరదరాజు మార్కండేయ కుమారస్వామి పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper