ఎన్ని ప్రభుత్వలు మారినా పనులు మనం శూన్యం ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజలను ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోవడం లేదు

July 28, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 28 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ;జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండలం 2009 వరదల గుణపాఠం మరువొద్దుకొత్త రాజోలిలోనే ఎంఆర్ఓ కార్యాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలి11 గ్రామాల ప్రజల భవిష్యత్తు ప్రభుత్వ రికార్డుల భద్రత కోసం ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు మొరుగు వీరేష్ డిమాండ్2009 అక్టోబర్‌లో తుంగభద్ర కృష్ణా నదులకు సంభవించిన చారిత్రాత్మక వరదలు పాత రాజోలి గ్రామాన్ని పూర్తిగా ముంపునకు గురిచేసి వేలాది కుటుంబాలను నిరాశ్రయులను చేసిన విషాదాన్ని ప్రభుత్వం మరవకూడదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు మొరుగు వీరేష్ అన్నారు. ఆ విపత్తు మళ్లీ పునరావృతం కాకుండా ప్రస్తుతం ప్రభుత్వం నిర్మించబోతున్న రూ.2.25 కోట్ల ఎంఆర్ఓ కార్యాలయంతో పాటు భవిష్యత్తులో నిర్మించబోయే అన్ని ప్రభుత్వ కార్యాలయాలను కొత్త రాజోలి గ్రామంలోనే ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.2009 అక్టోబర్ 2 నుంచి 5 వరకు కురిసిన భారీ వర్షాలతో తుంగభద్ర నది ఉద్ధృతంగా ప్రవహించి, ఆనకట్టల నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో కృష్ణా తుంగభద్ర సంగమ ప్రాంతాలు జలమయ మయ్యాయి. అప్పటి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని ఆలంపూర్ ప్రాంతంతో పాటు పాత రాజోలి గ్రామం పూర్తిగా వరద ముంపునకు గురైంది. వేల ఎకరాల పంటలు నాశనమవగా ఇళ్లు ప్రభుత్వ భవనాలు, రహదారులు విలువైన ప్రభుత్వ రికార్డులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.ఈ విపత్తు అనంతరం అప్పటి ప్రభుత్వం వరద ముంపు లేని ఎత్తైన ప్రాంతంలో కొత్త రాజోలిని ఏర్పాటు చేసి సుమారు 3,700 కుటుంబాలను పునరావాసం కల్పించడంతో పాటు పాఠశాలలు, ఆసుపత్రి, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం 10 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కేటాయించింది. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఇప్పుడు కూడా ప్రభుత్వ కార్యాలయాలన్నీ కొత్త రాజోలిలోనే ఏర్పాటు చేయాలని మొరుగు వీరేష్ అన్నారు. ఇటీవల కొత్త రాజోలి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎంఆర్ఓ రామ్మోహన్‌కు వినతిపత్రం అందజేసి, ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2.25 కోట్లతో నిర్మించనున్న ఎంఆర్ఓ కార్యాలయాన్ని కొత్త రాజోలిలోని 2 ఎకరాల ప్రభుత్వ భూమిలోనే నిర్మించాలని కోరిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రజల డిమాండ్ పూర్తిగా సమంజసమైనదేనని పేర్కొన్నారు.కొత్త రాజోలిలో కార్యాలయాల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలువరద ముంపు ప్రమాదం లేకుండా ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భద్రత.గ్రామపంచాయతీ రెవెన్యూ విద్య తదితర కీలక రికార్డుల రక్షణ.మండలంలోని 11 గ్రామాల ప్రజలకు ఒకే కేంద్రంలో ప్రభుత్వ సేవలు.విశాలమైన ప్రభుత్వ భూమి పార్కింగ్, భవిష్యత్తు విస్తరణకు అనువైన స్థలం.ప్రజలకు సులభ రాకపోకలు మెరుగైన పరిపాలనా సౌకర్యాలు.ఎంఆర్ఓ రామ్మోహన్ ప్రజల వినతిపత్రాన్ని స్వీకరించి సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడం స్వాగతించదగ్గ విషయమని మొరుగు వీరేష్ పేర్కొన్నారు.11 గ్రామాల ప్రజల భవిష్యత్తు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ, పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఎంఆర్ఓ కార్యాలయంతో పాటు భవిష్యత్తులో నిర్మించబోయే అన్ని ప్రభుత్వ కార్యాలయాలను కొత్త రాజోలి గ్రామంలోనే ఏర్పాటు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మొరుగు వీరేష్ గట్టిగా డిమాండ్ చేశారు.

🌐 Select Language:
📰 ePaper