
జనం న్యూస్ జూలై 25 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ)రామచంద్రపురం :డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్.ఐ.ఆర్ - స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో బిజెపి నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.బిజెపి మండల అధ్యక్షులు ఆకేటి శ్రీకృష్ణ ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి సతీష్ రావు, బి.ఎల్.ఏ-2 లతో కలిసి మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లోని పోలింగ్ బూత్ లను సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్ అధికారులను కలిసి ఎస్.ఐ.ఆర్ ప్రక్రియకు సంబంధించిన రిపోర్టులను తీసుకొని పరిశీలించారు.అదేవిధంగా బిజెపి నాయకులు రామచంద్రపురం ఎం.ఆర్.ఓ బండి మృత్యుంజయ రావును ఆయన కార్యాలయంలో కలిశారు. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో భాగంగా చేపట్టిన చర్యలు, ఓటర్ల జాబితా నమోదు, సవరణలపై పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.అధికారుల పనితీరుపై సంతృప్తిఎం.ఆర్.ఓ, వి.ఆర్.ఓ లు, పోలింగ్ బూత్ అధికారులు ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించారని పేర్కొంటూ వారి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దిశగా అందరూ సమన్వయంతో పనిచేశారని అభినందించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పుల్లెల రామమూర్తి, బిజెపి ఓ.బి.సి. మోర్చా నాయకులు ఇంధన సత్యనారాయణ తో పాటు పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.