
జనం న్యూస్ | జూలై 24 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 'గిఫ్ట్ ఏ స్మైల్' సేవా కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, బాగ్ అమీర్లో విద్యార్థులకు పాఠశాల బ్యాగులు, భోజన ప్లేట్లు, వివిధ రకాల ఆట వస్తువులను మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ, కేటీఆర్ ప్రతి పుట్టినరోజును సేవా కార్యక్రమాలకు అంకితం చేస్తూ 'గిఫ్ట్ ఏ స్మైల్' పేరుతో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యా, క్రీడా సామగ్రిని అందించడం జరిగిందని తెలిపారు.విద్యార్థుల మానసిక వికాసం, ఏకాగ్రత, సృజనాత్మకత పెంపొందించేందుకు క్యారం బోర్డులు, చెస్ బోర్డులు, స్కిప్పింగ్ తాడులు, స్నేక్ అండ్ లాడర్స్, చైనీస్ చెక్కర్స్, పజిల్ గేమ్స్, రింగ్ బాల్స్, లూడో గేమ్స్ వంటి ఆట సామగ్రిని అందజేసినట్లు చెప్పారు. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకుని ఆనందంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, సీనియర్ నాయకులు గొట్టుముకుల పెద్ద భాస్కరరావు, మాచర్ల భద్రయ్య, తీగల కృష్ణారావు, విజయలక్ష్మి, సంజీవరావు, జగదీష్ గౌడ్, యాదయ్య, సతీష్, రవీందర్ రావు, మురళి, కిరణ్, బాబు, అనిల్, ప్రవీణ్, నవీన్, మల్లేష్, సంతోష్, శ్రీరామ్, శ్రీనివాస్, నరహరి, సంపత్, హరీష్, నరేష్, శ్రీధర్ రావు, అఖిల్, జైకుమార్, శివ తదితరులు పాల్గొన్నారు.