కేపీహెచ్‌బీ నూతన సీఐ విజయ్ కుమార్‌ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేసిన పిడికిటి గోపాల్ చౌదరి

July 27, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ | జూలై 27 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి : కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయ్ కుమార్ను కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సోషల్ మీడియా వారియర్ పిడికిటి గోపాల్ చౌదరి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా విజయ్ కుమార్‌కు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేసిన గోపాల్ చౌదరి, ప్రజలకు సత్వర న్యాయం అందించేలా పోలీస్ శాఖ సేవలు కొనసాగాలని ఆకాంక్షించారు. కేపీహెచ్‌బీ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.అందుకు స్పందించిన సీఐ విజయ్ కుమార్, ప్రజల సహకారంతో సమర్థవంతమైన పోలీసింగ్ అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. ఈ మర్యాదపూర్వక భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.

🌐 Select Language:
📰 ePaper