గద్వాల జిల్లా అయిజ తెలంగాణ రాజ్యాధికారం పార్టీ బలోపేతంపై సుదీర్ఘ చర్చ
జనం న్యూస్ 22 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశానుసారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి వేములవాడ మదన్మోహన్ రావు, కోరిక మేరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభివృద్ధి కొరకు గద్వాల. మల్దకల్.ధరూర్. కె టి దొడ్డి.గట్టు. అయిజ.వడ్డేపల్లి. మనపాడు. ఉండవల్లి. అలంపూర్.ఇటిక్యాల.రాజోలి. ఎరవల్లి. అన్ని మండలాలలో టి ఆర్ పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ. బలపేతం చేయడానికి. సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూర్ ఉప్పరి గంగాధర్ ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు
ఈ సందర్భంగా సింధనూర్ ఉప్పరి గంగాధర్, మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మన్న పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు మన్న సంఘటితంగా పనిచేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.ఈ సమావేశంలో భద్రత, ఉపాధి అవకాశాలు, విద్య, ఆరోగ్యం సామాజిక సాధికారత వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారం కోసం ఉద్యమాత్మకంగా పనిచేయాలని నాయకత్వం పిలుపునిచ్చింది.అలాగే ప్రతి గ్రామం డివిజన్ వార్డు కాలనీలో ప్రతి ఒక్కరిని కమిటీలలో బలోపేతం చేయాలని, ఇంటింటికీ వెళ్లి పార్టీ సిద్ధాంతాలు, విధానాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. మన పార్టీలో చేరబోయే మహిళలను రాజకీయంగా చైతన్యవంతులను చేయడం, యువతను పార్టీలోకి ఆకర్షించడం, రాబోయే పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీడియా ఇంచార్జ్ యు.రాముడు, మండల ప్రధాన కార్యదర్శి జుంజు కృష్ణ, రాజోలి మండలం చిన్న ధన్వాడ జి. సుధాకర్ బొంపురం బి.తిమ్మరాజు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు