చలో లోక్ భవన్ నిరసన విజయవంతం.. కూకట్‌పల్లి నుంచి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు

July 22, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూలై 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థుల సమస్యలపై ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం వద్ద శాంతియుత ధర్నా చేపట్టిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేశారంటూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన “చలో లోక్ భవన్” నిరసన కార్యక్రమం భారీగా జరిగింది. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ నుంచి లోక్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, టీపీసీసీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ సారథ్యంలో కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, బ్లాక్, డివిజన్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి నిరసనకు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలపై గళం విప్పుతున్న రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. విద్య, ఉపాధి, యువత భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను లేవనెత్తే ప్రతి గొంతును అణచివేయాలనే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఆందోళనకరమని అన్నారు.దేశంలోని విద్యార్థులు, యువతకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తుందని బండి రమేష్ స్పష్టం చేశారు. కార్యక్రమం ప్రశాంతంగా సాగగా, కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

🌐 Select Language:
📰 ePaper