చెయ్యేరు హైస్కూల్ లో వికలాంగ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేత

August 15, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ ఆగస్టు 15 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు జడ్పీ హైస్కూల్ నందు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న వికలాంగులైన విద్యార్థులకు చిరు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గత సుమారు ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున కాపునాడు ముమ్మిడివరం నియోజకవర్గ కన్వీనర్ మరియు బీజేపీ సీనియర్ నాయకులు నంద్యాల చంటి సహకారంతో ఈ సహాయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఆయన సహకారంతో వికలాంగ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా నంద్యాల చంటి మాట్లాడుతూ సమాజంలో వికలాంగులు ఆత్మగౌరవంతో జీవించేందుకు అందరి సహకారం అవసరమని, చదువులో రాణించి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

🌐 Select Language:
📰 ePaper