జగద్గిరిగుట్ట నూతన సీఐ సురేష్‌కు ఘన సన్మానం శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తి సహకారం అందిస్తాం: చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి
జనం న్యూస్ | జూలై 25 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్గా సురేష్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వెంకటేశ్వర నగర్ డివిజన్‌కు చెందిన సీనియర్ నాయకులు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సీఐ సురేష్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి, పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వర నగర్ డివిజన్ పరిధిలోని పాపిరెడ్డినగర్తో పాటు ఇతర ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖతో సమన్వయంతో పనిచేస్తామని పేర్కొన్నారు.నూతన సీఐ సురేష్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, జగద్గిరిగుట్ట పరిధిలో శాంతిభద్రతలు మరింత పటిష్టంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చర్ల రామకృష్ణ రెడ్డి, గడ్డం రాజేశ్వర్ రెడ్డి, దొడ్ల రామిరెడ్డి, చిట్టిరెడ్డి గోపాల్ రెడ్డి, డాకురి అక్కిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.