జహీరాబాద్‌కు నూతనఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు వినతి

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జులై 22 07 2026హైదరాబాద్‌లోని రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ రాష్ట్ర డీజీపీని కలిసి జహీరాబాద్‌కు నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న పట్టణ పరిధి, పరిశ్రమల అభివృద్ధి, విద్యాసంస్థలు, ప్రజా రవాణా వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్య తీవ్రతరమవుతోందని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.అలాగే, జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.జహీరాబాద్ ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు ఈ ప్రతిపాదన ఉపయోగపడుతుందని పేర్కొంటూ, దీనిపై సానుకూలంగా స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు కోరారు.