జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియాలో వర్షం కురిస్తే చాలు ప్రజల ప్రాణాలు అరచేతిలోనే

డ్రైనేజ్ నీరు రోడ్డుపైనే మురికి నీరు రోడ్డుపైనే వర్షం నీరు రోడ్డుపైనై మరి మోరీలు ఎక్కడ
37వ వార్డు కౌన్సిలర్ పెద్దబయి మైపాల్
మరియు టీవైజే ఎఫ్ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ మొహమ్మద్ ఇమ్రాన్
జనం న్యూస్ 22 -07-2026 ప్రధాన రహదారులపై గుంతలు అరగజం పాటు లోతుకు ఉన్నప్పటికీ రోడ్డుపైన వర్షం నీరు చేరుకోవడంతో గుంతలు ఎక్కడున్నాయో ఎర్రటి నీటిలో తెలవక టూవీలర్ ప్రయాణదారుల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారుప్రధానంగా జహీరాబాద్ నుండి తాండూర్ వెళ్లే రహదారి ప్రధానంగా మనం చూసుకుంటే బాగా రెడ్డి ఫ్లైఓవర్ నుండి రాంనగర్ మరియు మల్చల్మ గ్రామం వరకు రోడ్డు మొత్తం పాడైనప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా కనీసం మరమ్మత్తులు చేయాలన్న ఆలోచనలు లేరు డాంబర్ రోడ్ మొత్తం గుంతలతో పాడైన ఇస్తే ఆ గుంతలలో సేడే మన్నును తెచ్చి నింపుతున్నారు ఆ సేయడం అన్న కాస్త నీటిలో నాని బురదగా మారడమే కాకుండా ప్రయాణించే ప్రయాణకుల వాహన టైర్లకు గ్రిప్ ఇవ్వకుండా బండ్లు జారీ ప్రజలు బొక్క బోర్లా పడుతున్నారు ఇంత జరుగుతున్న అధికారులు గానీ నియోజకవర్గ ఎమ్మెల్యే గాని పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గాని మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ గాని రోడ్డు నిర్మాణ శాఖ అధికారులు గానీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారుచెప్పుకోవడానికే వంద ఫీట్ల రోడ్డు రెండు వైపులా కాల్వల్ల నిర్మాణం లేక ఫ్లై ఓవర్ పక్కన ఉన్న ఉష్కా అడ్డ దగ్గర రోడ్డు ఎంత దంసంగా అయిందో మీకు అందరికీ తెలుసు వందల టన్నుల కొద్ది లారీల బరువుకు రోడ్డు మొత్తము పెద్ద పెద్ద గుంతలుగా మారింది ఉష్కా అడ్డ దగ్గర నుండి రాంనగర్ వరకు పుష్క లారీలు రోడ్డు పైనే కంకర్ షాపులు రోడ్డుపైనే హార్డ్వేర్ షాపులు రోడ్డుపైనే 100 ఫీట్ల రోడ్డు చెప్పడానికి మాత్రమే 20 ఫీట్ల రోడ్డుకు మాత్రం పరిమితం చేసిన షాపు ఓనర్లు వారిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారో సమాధానం చెప్పాలి రెండు వైపులా కాల్వల నిర్మించి 100 ఫీట్ల రోడ్డును పూర్తిగా ప్రజలకు అందుబాటులో తేవాలని మొహమ్మద్ ఇమ్రాన్ టీవైజే ఎఫ్ నియోజకవర్గ జహీరాబాద్ డిమాండ్ చేస్తున్నారు