జాతీయ జెండాలతో జిల్లా పర్యటన.
జనం న్యూస్ ఆగస్టు 15 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో పితాని వారి పాలెం లో రాజోలు మండలం మోరి గ్రామం నుండి ఏలూరి శివ వెంకట సుబ్బారావు తన మోటార్ సైకిల్ ను రధముగా తయారు చేసుకుని జాతీయ జెండాలతో అలంకరించి తెల్లవారుజాము నుండి రాత్రి వరకు అన్ని మండలాలను కలుపుతూ పర్యటన చేయడం జరుగుతుంది ఈ పర్యటనలో భాగంగా మురమళ్ళ పితానివారి పాలెంలో యూత్ సంఘం సభ్యులు గ్రామస్తులు కలిసి శివ సుబ్రహ్మణ్యంను అభినందించడం జరిగింది ఈ పర్యటన దేశం కోసం ధర్మం కోసం స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన మహానుభావులు గురించి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ దేశం కోసం ధర్మం కోసం పాటుపడే విధంగా ప్రసారం చేయటమే తన ధ్యేయ మని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచారక్ బోంతు కనకారావు పితాని శ్రీనివాసరావు కొప్పిశెట్టి రమేష్ దోనబోయిన మోహనరావు కుడిపూడి కృష్ణ సానబోయిన నాగరాజు కండిబోటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.