డా బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ మరియు పీజీ అడ్మిషన్ల నోటిఫికేషన్
జనం న్యూస్ : 25 జూలై శనివారం; సిద్దిపేట నియోజక వర్గ ఇంచార్జి వై.రమేష్ :డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ (సి బి సి ఎస్) ప్రథమ, ద్వితీయ,తృతీయ మరియు పిజి(సెమ్ )ప్రథమ, ద్వితీయ సంవత్సర కోర్సుల్లో ఎలాంటి అపారాధ రుసుము లేకుండ అడ్మిషన్ పొందుటకు గడువు పొడిగించారు.చివరి తేది:07-08-2026 అడ్మిషన్ పొందగోరే విద్యార్థులు డిగ్రీ ప్రథమ సంవత్సరo లో అడ్మిషన్ పొందుటకు ఇంటర్మీడియట్/ఓపెన్ స్కూల్ సొసైటీ పాలిటిక్/ ఐటీ ఐ 10+2 తత్సమాన కోర్సుల్లో పాసైన వారు అర్హులు.పిజి ప్రథమ సెమిస్ట ర్ సంవత్సరo లో అడ్మిషన్ పొందుటకు డిగ్రీ తత్సమాన కోర్సుల్లో పాస్ అయిన వారు అర్హులు. అడ్మిషన్ల కొరకు అభ్యర్థులు టి ఎస్ ఆన్లైన్ లేదా మీసేవ లేదా ఇంటర్నెట్ కేంద్రాల్లో www.braouonline.in లో రిజిస్ట్రేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఫారం తో పాటు సంబందించిన ఒరిజినల్స్ మరియు జిరాక్స్ సర్టిఫికెట్స్ కాఫీలు తీసుకొని సమీప అభ్యాసకుల సహాయ కేంద్రంలో వెరిఫికేషన్ చేయించుకున్న తరువా టి ఎస్ లేదా మీసేవ లేదా ఇంటర్నెట్ కేంద్రాల్లో ఫీజు చెల్లించిన తరువాత రిజిస్ట్రేషన్ ఫారం మరియు జిరాక్స్ సర్టిఫికెట్స్ కాఫీలు అభ్యాసకుల సహాయ కేంద్రంలో సమర్పించి అడ్మిషన్ పొందగలరని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు గల డా.బీ.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంతీయ అభ్యాసకుల సహాయ కేంద్రo రీజినల్ కోఆర్డినేటర్ డా,, యం శ్రద్ధానందం ఒక ప్రకటన లో తెలియ జేసారు మిగతా వివరాలకు స్థానిక అభ్యాసకుల సహాయ కేంద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు సంప్రదించ గలరు. ఫోన్ నంబర్: 7382929615.