తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గుర్తింపు కమిటీ సమావేశానికి తరలి వెళ్ళిన నాగార్జునసాగర్ ఉద్యమకారులు

July 20, 2026 | తెలంగాణ

జనం న్యూస్ -జూలై 20- నాగార్జునసాగర్ టౌన్- హైదరాబాద్ అమర జ్యోతి ప్రాంగణంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గుర్తింపు కమిటీ సమావేశంలో పాల్గొన్న నాగార్జునసాగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ తెలంగాణ ఉద్యమకారులుహైదరాబాద్ అమర జ్యోతి ప్రాంగణంలో గత 15 రోజుల నుండి గుర్తింపు కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్న సందర్భంగా సోమవారం నాడు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉద్యమకారులు తరలి వెళ్లారు. సమావేశంలో ఉద్యమ సమయంలో జరిగిన అంశాల గురించి అమరవీరుల కుటుంబాల గురించి , ఉద్యమ సమయంలో ఎఫ్ఐఆర్, కేసులు ఉన్న ఉద్యమకారుల గురించి చర్చించడం జరిగింది. కేకే గుర్తింపు కమిటీ సభ్యులకు పలు సూచనలను సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ కర్ణ బ్రహ్మానందరెడ్డి , రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులు సిరికొండ మధు , జిల్లా నాయకులు సిహెచ్ జంగన్న , నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు ప్రకాష్ ముదిరాజ్ , నల్గొండ జిల్లా కార్యదర్శి , పెద్దవూర మండలం అధ్యక్షుడు చెరుకుపల్లి శ్రీనివాస్ (వాసు) , ప్రధాన కార్యదర్శి ఊర శ్రీను తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper