తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు విద్యాసంస్థల బంద్

July 23, 2026 | వైరల్ వార్తలు

కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి

జనం న్యూస్ మోహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ బ్యూరో ఇంచార్జ్ 23 -07-2026 నీట్ (NEET) పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో అవకతవకలకు నిరసనగా మరియు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జులై 24 (రేపు) తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ఎన్‌ఎస్‌యూఐ తదితర విద్యార్థి సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది “నీట్‌ పరీక్షల నిర్వహ ణలో వరుస వైఫల్యాలు, పేపర్ లీకేజీలు, దేశ విద్యావ్యవస్థలో నెలకొన్న సంక్షోభాన్ని నిరసిస్తూ ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌‌‌‌కు విద్యార్థి సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది.” అని పేర్కొంది. అంతేకాకుండా, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ (ABVP) సైతం ప్రత్యేకంగా రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది “రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల నుంచి యూనివర్సిటీల వరకు అన్ని రకాల విద్యా సంస్థలను రేపు మూసివేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తోంది.. దీని కారణంగా శుక్రవారం రోజున ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు మూతపడే అవకాశం ఉంది.

🌐 Select Language:
📰 ePaper